ఆలుమగల కాపురం అనురాగ గోపురం అవ్వాలంటే - Alumagala Kapuram should become Anuraga Gopuram
చాలా మంది భార్యా భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎంత సర్దుకుపోదాం అన్న గొడవలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అన్యోన్య దాంపత్యం కోసం పండితులని మార్గాలని అడగడం లేదా ఏదైనా వ్రతాల్ని పాటించడం, లేదా మాంత్రికుల్ని కలవడం వంటివి చేస్తుంటారు. ఈ క్రింది సూత్రాలను పాటించడం వల్ల సంతృప్తిగా ఉంటారు. పైగా చికాకు, తగాదాలు వంటివి కూడా తొలగి పోతాయి ఇన్ షా అల్లాహ్. ఓ భార్యగా నేను సాదర స్వాగతం • నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను. • వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను. • ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను. • నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను. • వారి కోసం నేను నీళ్ళగ్లాస్ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను. బంధు మిత...