ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి? - What good has Islam done to women?

 ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి?

స్త్రీ గొప్పదనం

సృష్టి ప్రారంభమైన నాటినుంచి తన కన్నా బిడ్డల గురించిభర్త గురించికుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూతనవారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ఒకే ఒక్కరు " స్త్రీ". ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా ఒక అమ్మకు కొడుకే  అందుకే చెప్పారు పెద్దలు అయితే పురుషాహంకార సమాజం  కారణంగా మహిళలలు అనేక  ఎదుర్కొంటున్నారు




మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు కొన్ని -

1. కనీస మానవ హక్కులను దూరం చేయడం: జీవించే హక్కుమాట్లాడే హక్కునిర్ణయం తీసుకునే హక్కు మొదలైనవన్నీ వారికి దూరం చేయడం.

2. ప్రాథమిక హక్కులైన విద్యఆర్థిక స్వతంత్రతసమానహోదా మొదలైనవన్నీ నిరాకరించడం.

3. మహిళలపై సమాజవైఖరిగృహహింసపనిచేసే దగ్గర లైంగికమానసిక హింస.

4. చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసివారిని బయటకు రాకుండా చేసివారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు.

5. లింగ అసమానత అన్ని రంగాల్లో పాతుకుపోయింది.

6. నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యం లేకపోవడం.

7. మహిళను వివిధ భౌతిక హింసలకు గురిచేయడం పెరిగిపోయాయి.

ఇలాంటి తరుణంలో ఈ జఠిల సమస్యకు ఇస్లాం ఏమైనా తరుణోపాయం కాగలుగుతుందా తెలుసుకుందాం! ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటో తేల్చుకుందాం!!

 


మహిళల హక్కుల విషయంలో ఇస్లాం ఒక  మేలిమి మలుపు

ఇస్లాం -  విశ్వ ప్రభువు తరఫు నుండి విశ్వ  జనులందరి కోసం ఎన్నుకోబడిన విశ్వ జనీన ధర్మం. వర్ణవర్గరంగురూపుభాషాప్రాంతంఆడమగ అన్న తేడా లేకుండా - అందరి హక్కును సమానంగాన్యాయబద్ధంగా  అంగీకరించే ధర్మం ఇస్లాం. వారి హక్కులకు పూర్తి పూచి పుచ్చుకునే ప్రకృతి సిద్ధ  ధర్మం ఇస్లాం.  ఇస్లాంలో స్త్రీలు  - వారు పసి పిల్లలయినాయవ్వనస్తులయినా, , కూతురు అయినాభార్య అయినాతల్లి అయినాచెల్లి అయినాఅమ్మమ్మ అయినానాన్నమ్మ అయినా -  వారందరికీ  ఎంతో గొప్ప  స్థానం ఉంది.

అనేక సందర్భాల్లో దైవ ప్రవక్త (స) మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని నొక్కి వక్కాణించారు: మీరు మహిళల యెడల మంచిగా వ్యవహరించండి. (బుఖారీముస్లిం). ధర్మ ఆదేశాలు వర్తించే విషయంలో - ''నిశ్చయంగా స్త్రీలు పురుషుల తోబుట్టువులు" అన్నారు. (అబూ దావూద్)

సర్వశక్తిమంతుడైన అల్లాహ్  ఆజ్ఞ ప్రకారంమహిళల సామాజిక మరియు ఆర్థిక హక్కులు మంజూరు చేయబడ్డాయి. ఇవి సుదీర్ఘ పోరాటాలతోప్రాం త్యాగాలతోధర్నాలతోఆమరణ నిరాహారదీక్షలతో సాధించున్నవి కాదుప్రక్రుతి సిద్ధంగా పడుతుల్ ప్రభువయిన అల్లాహ్ వారికి జన్మతః అనుగ్రహించిన జన్మహక్కులు. వాటికి  పురుషుల మాదిరిగానే ఇస్లాంలో హామీ ఇవ్వబడింది. ఈ హామీ అనేది భద్రతరక్షణన్యాయం మరియు స్థిరత్వం రీత్యా  ఉన్నత ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. తొలి మానవుడయిన ప్రవక్త ఆదమ్ (అ) వారికి పూర్వం నుండే ఉన్న ఇస్లాం ధర్మం -  1,440 సంవత్సరాల క్రితం పరిపూర్ణమయింది. అది మహిళల హక్కులకు సంబంధించి చారిత్రాత్మకమైన మేలిమి  మలుపు.

అరేబియా ద్వీపకల్పం మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీపురుషుల మధ్య వివక్షఆడ శిశుహత్యస్త్రీల ఆర్థిక మరియు సామాజిక హక్కులను స్వాహా  చేసుకోవడంబాలికలను బలవంతంగా వివాహం చేసుకోవడం వంటి మహిళలకు హాని కలిగించే దౌర్జన్యపూరిత ఆచారాలు అమల్లో ఉండేవి. ఈ వికృత విధానాలన్నింటి ఇస్లాం నిషేధించింది. అన్ని రకాల వైవాహిక అవమానాల నుండి మహిళలను కాపాడింది.

ఇస్లాం మహిళల సంపాదనఆస్తిపాస్తుల్ని  రక్షిస్తుంది.  వాటిని ఎవరూ వారి నుండి లాక్కోలేరు. ఇస్లాం మహిళల  వారసత్వపు హక్కును ఆమోదించింది.  ఆమె కుటుంబ స్థితిని బట్టి వారసత్వపు వాటాను నిర్ణయించే ఒక దైవిక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది ఒక గొప్ప సాంస్కృతికసాంఘికఆర్ధిక  మార్పు.  మహిళలకు వారసత్వ హక్కును ఇవ్వని సమాజాలకు ఇది ఓ కనువిప్పు. పూర్వం - స్త్రీ పురుషుని ఆస్తిలో  భాగంగాభర్త చనిపోతే వారసత్వపు సొత్తుగా  భావించేవారు. ఇస్లామీయ  వారసత్వ చట్టం నేటికీ అనేక పాశ్చాత్య న్యాయస్థానాలలో చట్టపరమైన దిక్సూచిగా ఉంది అనేది నిర్వివాదాంశం.

ఇస్లాం వివాహితులువిడాకులు పొందిన మరియు వితంతువుల స్త్రీలకు స్పష్టమైననిర్దిష్టమైన హక్కులను కేటాయిస్తుంది. మరియు భార్యకు తన భర్తపై ఉన్న హక్కులకు సమానమైన హక్కులను  ఆమెకు ఇస్తుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది:

సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒక మెట్టు ఆధిక్యత ఉంది. దేవుడు శక్తిమంతుడువివేచనాపరుడు. (అల్-బఖరహ్: 228)

మహిళల యెడల మంచిగా వ్యవహరించండి.

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారుఎవరైతే ఇద్దరు ఆడ పిల్లల పోషణా బాధ్యతను స్వీకరించి,వారు యవ్వన దశకు చేరుకునేంత వరకు వారి బాగోగులను చక్కగా గమనిస్తారో - వారు రేపు ప్రళయ దినాన వచ్చినప్పుడు - నేను మరియు వారు ఈ రెండు వ్రేళ్ళలా ఉంటారు అని ఆయన తాన్ రెండు వెళ్ళను కలిపి చూపించారు.(ముస్లిం)



స్త్రీకి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది

ఇస్లాం స్త్రీలను తన స్వంత అస్తిత్వం మరియు స్వతంత్ర వ్యక్తిత్వం గల  స్వేచ్చాయుత  స్త్రీగా  చూస్తుంది. ఆమె తన వంశంకుటుంబ పేరుతోనే పిలువబడుతుంది. అనేక పాశ్చాత్య సమాజాలలో జరిగే విధంగా వివాహం తర్వాత తన ఇంటి పేరును మార్చుకోదు. మహిళలకు హక్కులున్నట్లే  బాధ్యతలు కూడా ఉంటాయి. విధులుబాధ్యతలు రూపేణా తప్ప  స్త్రీ  పురుషుల మధ్య వ్యత్యాసం ఎలాంటి ఉండదు.

ఇస్లామీయ  సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉంది

సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర  చాల కీలకం అన్న విషయాన్నిఇస్లాం గుర్తిస్తుంది. ఆమె సమాజ అభివృద్ధిలో పాలు పంచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ కర్తవ్య నిర్వహణలో ఎక్కడా ఆమె పురుషునితో విభేదించదు. పైగా ఒకరు మరొకరని బల పరుస్తారుపూర్ణతను సాధిస్తారు. మహిళల కార్య పరిధి  ప్రధానంగా పిల్లల ఆలనా పాలన,  వారికి సుశిక్షణ ఇచ్చి సక్రమంగా పెంచడం కోసం ప్రత్యేకించబడింది. తద్వారా పిల్లలు సత్పౌరులుగాసత్సమాజ నిర్మాతలుగా,  భావి పౌరులుగా ఎదుగుతారు. సమాజ విచ్చిన్నానికి కాకుండా ఆదర్శ సమాజ నిర్మాణానికి బలమయిన  పునాదులుగా  రూపు దిద్దుకుంటారు. అయితే  ముస్లిం మహిళలు సామాజిక మరియు రాజకీయ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించితనదైన బలమైన ముద్రనువేసే పూర్తి స్వేచ్ఛఅధికారం వారికుంటుంది.

 

దైవ ప్రవక్త (స) మహిళా శిక్షణార్థంవిద్యాబోధ నిమిత్తం ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించేవారు. మహిళలు సామూహిక నమాజుఈద్ నమాజుప్రమాణంస్వఅభిప్రాయాన్ని తెలియజేయడం కోసం  రావలసిందిగా ఆయన ప్రోత్సహించారు. స్వయంగా ప్రవక్త (స) ప్రాపంచిక విషయాలలో తన సహచరులతో సలహాసంప్రతింపులు జరిపినట్లేతన సతీమణులు సలహాలు సయితం తీసుకోకునేవారు. అలాగే సంఘ ఇతర మహిళలు కూడా వారి వారి అవసరాలను  ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి చెప్పుకునేవారు. అయన ఇచ్చిన సలహాలనుచూపిన పరిష్కారాలను అమలు పరచేవారు కూడాఎంతవరకంటేఒక సామాన్య బానిస మహిళపని మనిషి తన సమస్యను ప్రవక్త (స) వారి ముందర పెట్టడానికి భయ పడేది కాదు.

సమాజాని సేవవిద్యనర్సింగ్వైద్యం వంటి  రంగాలలో ముందు తరాల సుశిక్షణ నిమిత్తం  పని చేయాలని ఇస్లాం మహిళలను ప్రోత్సహిస్తుంది.  అనేక సందర్భాల్లోప్రవక్త (స)  స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించాలని తాకీదు చేశారు.  పెరిగి పెద్దయ్యే వరకు  ఆడపిల్లలను మంచిగా తర్ఫీదు ఇవ్వాలనివారిని ఆదర్శ మహిళకు తీర్చిదిద్దాలని ఆయన అభిలషించారు. 

 దైవ ప్రవక్త (స)  ఇలా సెలవిచ్చారుఎవరైతే ఆడపిల్లల విషయంలో పరీక్షకు గురి చేయబడిఓర్పునేర్పుతో  వారిని  చక్కగా పెంచివారు పెద్దయ్యే వరకు ధర్మమార్గంలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారో -  వారికీ నరకాగ్ని నుండే కాపాడే కవచాలుగా ఆడ పిల్లలుంటారు> (బుఖారీముస్లిం)

ఆధునిక యుగంలో మహిళలు మరియు ఇస్లాం

ఆధునిక యుగం మునుపటి చారిత్రక యుగాలకు భిన్నంగా వేగవంతమైన మార్పులను చూస్తోంది. మరి ఇస్లాం బోధనలు ప్రస్తుత మహిళల అవసరాలను తీరుస్తున్నాయాప్రపంచంలోని చాలా దేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న  మూడు ప్రపంచ సమస్యలను మేము క్రింద ఇస్తున్నాము. ఇస్లాం వాటికి సమూల పరిష్కారాలను ఎలా చూ[పిందో   క్లుప్తంగా అందిస్తున్నాము:

1 - స్త్రీ శరీరాన్ని దుర్వినియోగం  చేయడం.

2  -  వివాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు.

3 - గృహ హింస మరియు మహిళలపై వేధింపులు.

1) ఆడదాని శరీరం  అంగడి సరుకు కాదు

ఇస్లాం స్త్రీలను గౌరవించిందిశారీరక దుర్వినియోగం నుండి వారిని రక్షించింది. ఆమె దేహాన్ని విలాస వస్తువుగా చూడటాన్ని,  ఆమెను  వ్యభిచారం కుంపటిలోకి లాగడాన్నివారిని పురుషులకు ఎరగా వాడుకోవడాన్ని  గర్హించింది,  నిషేధించింది. అలాగే  మగువ జీవితాన్ని నాశనం చేసేఆమె గౌరవానికిఆత్మాభిమానానికి భంగం కలిగించే  నగ్నత్వాన్ని. అర్థ నగ్నత్వాన్నిసంఘ నీతికినైతికతకు  విరుద్ధమైన ప్రతి చర్య మరియు క్రియను ఇస్లారం నిషేధించింది. సిగ్గుమాలిన చేష్టల వల్ల ఆమె లైంగిక వేధింపులకు గురవ్వడమేకాఒక్కోసారి అపహరణకుఅత్యాచారానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

నేడు లైంగిక వ్యాపారంవ్యభిచారంలో చిన్న వయసు గల ఆడపిల్లలు దించడం ద్వారా - అశ్లీల సాహిత్యంబూతు సినిమాలునగ్నఅర్థ నగ్న చిత్రాల వెల్లువ అనేక సాంఘిక రుగ్మతలకు దారి తీసుతున్నది. ఫలితంగా -  ప్రాణాంతక వ్యాధులు నేటి యుగాయానికిరాబోయే తరానికి భయంకర  శాపంగా మారనున్నాయి.

ఆదం సంతానమా! మీరు మీ మర్మావయవాలను కప్పుకోవడానికిమీ దేహానికి రక్షణగాఅలంకరణగా ఉపయోగపడటానికి మేము మీకు దుస్తులు ప్రసాదించాము. అయితే అన్నిటికంటే భయభక్తుల దుస్తులే ఎంతోశ్రేష్ఠమైనవి. ఇది (వస్త్రధారణ) దేవుని సూచనల్లో ఒక సూచన. మీరు విషయం గ్రహిస్తారని (ఇలా తెలుపుతున్నాం).” (అల్-ఆరాఫ్: 26)

వ్యభిచారం దరిదాపులకు పోకండి. అది చాలా హేయమైనదిపరమచెడ్డదారి. (బనీ_ఇస్రాయీల్: 32)



2) వి వాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు లేని సమాజం

నేడు ప్రపంచ అనేక దేశాల్లో ఉన్నట్టు - స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాన్ని ఇస్లాం అనుమతించదు.

ఒక పురుషుడు మరియు స్త్రీకి మధ్య లైగిక సంబంధం వివాహం అనే పవిత్ర పద్ధతిలోనే ఏర్పడాలి. ఇస్లాం చెప్పే ఈ సువర్ణ సూత్రం  నేడు ప్రపంచంలో పెచ్చుమీరుతున్న అనేక సామాజికసాంసారికదాంపత్య సమస్యలకు  చక్కటి పరిష్కారం. వాటిలో ముఖ్యమైనవి: మహమ్మారి  రోగాల వ్యాప్తి,  వంశ మూలాలను కోల్పోవడంఅక్రమ సంతానం అధికమవ్వడంఅసలు తల్లిదండ్రులెవరో కూడా తెలియని అనామకఆశ్రయరహిత సంతానం పెరిగిపోవడం.

ఇస్లామీయ బోధనలు  వంశ వృక్షపరంపర పరిరక్షణనుపిల్లలు వారి తండ్రులు మరియు తల్లులతో  ఉండాలన్న ఖచ్చితమైన నియతిని కలిగి ఉంటాయి. గొప్ప విషయం ఏమిటంటే,  ఇస్లాం  ప్రజల సృష్టికర్త తరఫు నుండి  అందజేయబడిన  కుటుంబ చట్టాల ఆధారంగా   ఒక ఆదర్శవంతమైన  కుటుంబం ఉనికిలోకి రావాలని అభిలషిస్తోంది. ఆ కుటుంబ వాతావరణం -  స్త్రీలను గౌరవించేలా,  వారి మనో భావాలను గుర్తించేలా,  వారి ఆత్మాభినాన్ని రక్షించేలావారి  హక్కులను కాపాడేలా ఉండాలని  కోరుకుంటంది. అలాగే మహిళకు తన భర్తను ఎన్నుకునే స్వేచ్ఛహక్కు  హామీని ఆమెకిస్తుంది.  ఆమె గౌరవార్థం వివాహ సందర్భంగా మహర్ ను భర్తపై తప్పనిసరి చేసింది. 

 

ఇస్లాంపురుషుడు తన కుటుంబం మరియు పిల్లల ఆర్థిక బాధ్యత స్వీకరించాలని  కోరుతుంది.   అనివార్య కారణాల వల్ల విడిపోయినప్పుడు లేదా విడాకులు తీసుకున్నప్పుడుభరణం పొందే హక్కు  స్త్రీకి ఉంటుంది అంటుంది. గడువు   ముగిసే వరకు  ఆమెకు సంబంధించిన కూడుగూడుగుడ్డ ఏర్పాటు పురుషునిపై తప్పనిసరి అని గట్టి తాకీదు చేస్తుంది.

ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడువారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలుదయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (అర్-రూమ్: 21)

దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: “యువకుల్లారా! మీలో వివాహం చేసుకునే  శక్తి కలవారు వివాహం చేసుకోవాలి. ఆ శక్తి లేనివారు ఉపవాసవ్రతం పాటించాలి.  ఉపవాసం కామవాంఛను అదుపులో ఉంచుతుంది. శీలాన్ని రక్షిస్తుంది. చెడు  దృష్టిని కాపాడుతుంది " (బుఖారిముస్లిం)

ఆయన ఇంకా ఇలా అన్నారు: ఒక వ్యక్తి వ్యభిచారం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో  ఉండడు. ఒక వ్యక్తి దొంగతనం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో  ఉండడు. ఒక వ్యక్తి మద్యం త్రాగేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. (అంటే ఆ స్థితిలో విశ్వాసం అతన్నుండి వైదొలుగుతుంది).    (బుఖారీ) 

3) గృహ హింస మరియు మహిళలపై వేధింపులు

ప్రపంచవ్యాప్తంగా  స్త్రీలు ఎదుర్కొనే మిక్కిలి విచారకర సమస్యల్లో   గృహ హింస కూడా ఒకటి.   స్త్రీలపై అత్యాచారాలులైంగిక వేధింపులు రోజురోజుకి  ఎక్కువ అవుతున్నాయి.  గత కొన్ని దశాబ్దాలుగాకొన్ని ఆఫ్రికన్ దేశాలు ప్రపంచంలో అత్యధిక గృహ హింస మరియు అత్యాచార నేరాలను నమోదు చేశాయి.

యునైటెడ్ స్టేట్స్‌లోగృహ హింస సంఘటనల కారణంగా  సంవత్సరానికి $100 మిలియన్లకు పైగా ఖర్చు అవుతుంది.  ఇందులో పనికి హాజరుకాకపోవడం మరియు అనారోగ్య సెలవులు ఉన్నాయి. హింస ఫలితంగా మొత్తం వైద్య ఖర్చులు  సంవత్సరానికి సుమారు $5 బిలియన్లు చేరాయి.

స్పెయిన్‌లో,  మహిళలపై హింసాత్మక సంఘటనలు  అత్యంత దారుణంగా ఉన్నాయి. 2017 గణాంకాల ప్రకారం  మహిళలపై హింస సంబంధిత కేసులు 158,000 కంటే ఎక్కువ  నమోదవదయ్యాయి.

దీనికి భిన్నంగా - దాంపత్య సంబంధ బాంధవ్యం  - ప్రేమదయపరోపకారంత్యాగంనిబద్ధతపరస్పర గౌరవం అనే పునాదులపై నిర్మితమవ్వాలని ఇస్లాం ధర్మం పిలుపునిస్తుంది.



మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: “మీరు స్త్రీల పట్ల మృదువుగా వ్యవహరించండి. స్త్రీలు ప్రక్కటెముకలతో సృజించబడ్డారు. ప్రక్కటెముకలలో కూడా అన్నిటికంటే ఎక్కువ వంకరగా ఉండే పైఎముకతో సృజించబడ్డారు. మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. ఒకవేళ దాని మానాన వదిలేస్తే అది అలా వంకరగానే ఉంటుంది. కనుక మీరు స్త్రీలతో మంచిగా (మృదువుగా) మసలు కోండి." (బుఖారిముస్లిం) భార్య ముఖమ్మీద కొట్టరాదనిశరీరం కందిపోయే వస్తువులతో కొట్టరాదనినిర్దయగా కొట్టరాదని దైవప్రవక్త (సల్లం) అన్నారు. అలాంటి వారిని ఆయన అస్సలు ఇష్ట పడేవారు కాదు. పగలు గొడ్డులా బాదిరాత్రవగానే కామాంధుల్లా ప్రక్క చేరే బుద్ధి ఎలా కలుగుతుందయ్యా మీకుఅని పురుషాహంకారులను మందలించిన సందర్భాలు ఎన్నో.

ఎవరికైనా ఇద్దరు భార్యలుండివారిద్దరి హక్కుల్ని న్యాయంగాసమానంగాసమంజసంగా నిర్వర్తించకపోతేతీర్పుదినాన అతను సగం శరీరం కోల్పోతాడు. ఆ స్థితిలోనే (అర్థశరీరంతో సమాధినుండి) లేస్తాడు" అన్నారు దైవప్రవక్త (స). (తిర్మిజి)

కుదరని పక్షంలో -దంపతులిద్దరు దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండలేమని భయపడినప్పుడు స్త్రీ తన భర్తకు ఏమైనా ఇచ్చేసి అతని నుండి వేరుపడ దలచుకుంటే వారిద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదరడంలో తప్పు లేదు.  (బఖరః - 229)

మహిళకు సంబంధించి మహనీయ ముహమ్మద్ (స) చేసిన మహితోక్తులు

జీవితానికి సంబంధించిన సకల విషయాలలో పరమ ఆదర్శప్రాయులు మహనీయ ముహమ్మద్ (స). అయన - మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని ఆయన నొక్కి వక్కాణించారు.

ముందు మీ అమ్మ

ఒక వ్యక్తి దైవ ప్రవక్త పవిత్ర సన్నిధికి వచ్చి -  ఇలా విన్నవించుకున్నాడు: ఓ దైవ ప్రవక్తా!  నా  సత్ప్రవర్తనకు అత్యంత ఎక్కువ అర్హులు ఎవరుదానికి: "నీ  అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స).   ఆ తర్వాత ఎవరుఅని మళ్ళీ అడగ్గా - "నీ  తల్లి... అని సమాధానమిచ్చారు ప్రవక్త (స).  ఆ పిదప  ఎవరుఅని తిరిగి  ప్రశ్నించగా -  "నీ  అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆనక  ఎవరుఅని మళ్ళీ అడగ్గా  ''నీ తండ్రీ" బదులిచ్చారు ప్రవక్త (స).  (బుఖారీముస్లిం)

మహనీయ ముహమ్మద్ (స) జీవిత కాలంలో ఎవ్వరినీ ఎప్పుడు కొట్ట  లేదు. ఏ స్త్రీని కొట్టింది లేదు.  ఏ సేవకుణ్ణి కొట్టింది లేదు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేటప్పుడు తప్ప. అలాగే ఆయన్నుండి ఎవరికీ ఎలాంటి హానిఇబ్బంది  కలిగింది లేదు. ఆయన ఎవరితోనూ ఎలాంటి ప్రతీకారం తన స్వయం కోసం తీర్చుకుంది లేదు. అల్లాహ్ నిషేధితాలకు ఆ వ్యక్తి పాల్పడి ఉంటె తప్పఅలాంటి స్థితిలో ఆయన అల్లాహ్ కోసం ఆ వ్యక్తికి దండన విధించేవారు. (ముస్లిం)

ముహమ్మద్ (స) ఒక భర్తగా బాధ్యతాపరులైన గొప్ప నిజాయితీపరులు. వివాహం చేసుకోవాల్సిందిగాఉత్తమ కుటుంబాన్ని స్థాపించాల్సిందిగాసంతానాన్ని -  ఆడ మగ అనే వివక్ష చూపకుండా  సత్పౌరులుగా తీర్చి దిద్దాల్సిందిగా ఆయన (స) యువకుల్ని ప్రోత్సహించేవారు.

 

మహనీయ ముహమ్మద్ (స) - విద్య నేర్చుకోవాల్సిందిగా,  పండుగ నమాజు వంటి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా ఆయన మహిళల్ని ప్రోత్సహించేవారు. అలాగే పురుషులు  వారి బాధ్యతలను నిర్వర్తించినట్లే,  స్త్రీలు - వారి బాధ్యతలను సజావుగా నెరవేర్చాలి అని హితవు పలికేవారు. ఇస్లాంలో మహిళలు కూడా అల్లాహ్ సమక్షంలో వారికి సంబంధించిన బాధ్యతల గురించి ప్రశ్నించబడతారు. వనితలు ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా - సాంఘికసాంసారికి బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడే వారు  అన్ని రకాల అపమార్గాల నుండిఅపసవ్యతల నుండిపొరపాట్ల నుండి కాపాడబడతారు. ఫలితంగా  ఓ  సత్సమాజం నిర్మాణంలో ఆమె  బలమైన ముద్రను వేస్తుంది.

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ప్రవర్తన రీత్యా ఉత్తములైన వారే విశ్వాసం  రీత్యా పరిపూర్ణులు. మీ మహిళల యెడల ఉత్తములైన వారే మీలో పురుషోత్తములు. (తిర్మిజీ)

 దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నేను మరియు ఓ అనాథ పోషణ బాధ్యతను తీసుకున్న వ్యక్తి స్వర్గం ఇలా తోడుగా ఉంటాము - అని ఆయన తన చూపుడు వ్రేలునిమధ్య వ్రేలుని కాస్త ఎడంగా ఉంచి చూపించారు. (బుఖారి)

 దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ యెడల తఖ్వా కలిగి జీవించు. నీ వల్ల ఒక తప్పు జరిగితే వెనువెంటనే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టు. ప్రజలతో మంచిగా మసలుకో. (తిర్మిజీ)

 

చిరు విన్నపం! 

నేటి ముస్లిం మహిళ ఓ నగ్నసత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. భావితరం భవితవ్యం ఆమె చేతుల్లోనే ఉంది. ఆ చేతులతో ఒకసారి గీచిన 'గీతలుఅవి ధర్మానికి సంబంధించినవయినాఅధర్మానికి సంబంధించినవయినా సరే సమాధికి చేరేదాకా చెరిగి పోవు. ఆమె తన శిక్షణా సాధనంతో చరిత్ర దిశదశనే మార్చగలుగుతుంది. ఆ దిశ దైవానికైనా లేదా దుష్టశక్తికైనా అనుకూలమైనది కావచ్చు.

ముస్లిం మహిళలు స్వయంగా ఇమామ్ హుసైన్ (రజి)ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై)ముహమ్మద్ బిన్ ఖాసింసలాహుద్దీన్ అయ్యూబిఇమామ్ గజాలిఇబ్నె తైమియా లాంటి మహనీయులు కాకపోవచ్చు. కాని అలాంటి మహనీయుల్ని తయారు చేయగల శక్తి స్వరూపిణులు అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు.

ముస్లిం మహిళ ముందుకొచ్చి ఇలాంటి "కింగ్మేకర్" పాత్ర వహించగలిగితే అత్యున్నత మానవీయ విలువలుఅసామాన్య నైతిక ప్రమాణాలతో భాసిల్లే నవతరాన్ని తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి ఒక్కటే షరతు. ఆమె ఖతీజా (రజి)ఫాతిమా (రజి)ఆయిషా (రజి)జైనబ్ (రజి)లను తన హీరోయిన్ లుగాఆదర్శప్రాయులుగా స్వీకరించాలి.

Comments

Popular posts from this blog

ఆలుమగల కాపురం అనురాగ గోపురం అవ్వాలంటే - Alumagala Kapuram should become Anuraga Gopuram

వనిత పాలిట విషకృతి వరకట్న దుష్కృతి - A woman's curse is a dowry evil