ఆలుమగల కాపురం అనురాగ గోపురం అవ్వాలంటే - Alumagala Kapuram should become Anuraga Gopuram

చాలా మంది భార్యా భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎంత సర్దుకుపోదాం అన్న గొడవలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అన్యోన్య దాంపత్యం కోసం పండితులని మార్గాలని అడగడం లేదా ఏదైనా వ్రతాల్ని పాటించడం, లేదా మాంత్రికుల్ని కలవడం వంటివి చేస్తుంటారు. ఈ క్రింది సూత్రాలను పాటించడం వల్ల సంతృప్తిగా ఉంటారు. పైగా చికాకు, తగాదాలు వంటివి కూడా తొలగి పోతాయి ఇన్ షా అల్లాహ్.
ఓ భార్యగా నేను సాదర స్వాగతం • నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను. • వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను. • ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను. • నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను. • వారి కోసం నేను నీళ్ళగ్లాస్ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను. బంధు మిత్రులు శ్రీవారి బంధువులు - అతిథుల కోసం నేను మెచ్చేది కాక వారు ఇష్టపడే వంటకాలని చేసి పెడతాను. వారు విశ్రాంతి తీసుకునే గదులను నీటుగా ఉంచుతాను. నేను వారందరితో ప్రేమతో వాత్సల్యంతో మసలుకుంటాను. భర్త కోపం నేను వారి ముఖ్య కార్యాల్లో తలదూర్చను. ఏదైనా మాటనికాని లేక నా కోరికను గాని మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించను. • నేను వారిని చాలా మృదువుగా పలకరిస్తాను. నా మాట సరైనదైనా ఆ సమయంలో నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను మంచి సమయం చూసి వారికి చెప్పి ఒప్పిస్తాను. • వారు ఏదైనా మరచిన ఎడల నేను వారిని చాలా సున్నితమైన రీతిలో తెలియపరుస్తాను. • వారు రాజీపడిన తరువాతే నిద్రిస్తాను. వారికి ముందు నిద్రించను. • అప్పుడప్పుడు ప్రవక్త(స) గారి ఈ సద్వచనాన్ని వారి చెవిన వేస్తుంటాను. “నీ భార్యే నీ స్వర్గం, నీ భార్యే నీ సరకం", ఓ భర్తగా నేను • ఇంట్లో ప్రవేశించాక ఆమె ఎక్కువ బిజి అయితే నేను ఆమె పని బరువుని కాస్త తగ్గించడానికి ప్రయత్నిస్తాను. ఉ: బోకులు తోమటం, దిండ్లు దుప్పట్లు సర్దటం మొదలగు. ఇవన్నీ నేనేదో కొంగచాటు గులామునై చేయటం లేదు. ప్రవక్త(స) వారి ఈ ఆదేశం మేరకు “మీలో ఉన్నతుడు తన కుటుంబ సభ్యులతో మంచిగా మసలుకునే వాడే." ఆన్న సూక్తికి ప్రతి రూపం కాగలగాలన్నదే నా ఆశ. • రాత్రి సమయంలో పని భారాన్ని తగ్గించడానికి పిల్లల బాధ్యత పూర్తిగా నేనే స్వీకరిస్తాను. • అప్పుడప్పుడు ఆమెతో ఇంటి ఆవసరాల గురించి అడుగుతుంటాను. మాములు రోజుల్లో, పండుగ పూట విందు ఇచ్చే సందర్భాల్లో డబ్బు విషయంలో కాస్త తేడాని పాటిస్తాను. • సమయం మార్పుతోపాటు నా చెయ్యిని కాస్త తెరిచి వుంచుతాను. అప్పుడప్పుడు తెలిసే అవసరానికి మించి డబ్బు ఇస్తాను. మా ఇద్దరి జీవితాలు పునఃనిర్మించబడుతూ ఉండాలన్నదే నా ఆశ. బంధువులు • నేను ఆమె బంధు మిత్రులకు సేవలందిస్తాను. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు. • ఆమె తన బంధువులకి ఏమైనా ఇవ్వదలచుకుంటే ఎదురు చెప్పను. తల్లి దండ్రులకి వెళ్ళి చూసిరా అని ప్రోత్సహిస్తాను. • నేను ఆమె బందువుల దగ్గరకు వెళితే వారితో మంచి ఉత్సాహంతో చిరునవ్వులు చిందిస్తూ పలకరిస్తాను. సమయం సందర్భాన్ని బట్టి వారి కోసం బహుమానాలు తీసుకెళతాను. • వారి బంధువుల ఎదుట, నా ఇంటిని ఆమె ఓ స్వర్గంగా మార్చేసిందని, బిడ్డల పెంపకం పట్ల చాలా శ్రద్ధ వహిస్తుందనీ, ఆమెని భార్యగా పొందినందుకు నేను అదృష్టవంతుడని మెచ్చుకుంటాను. • ఆమె అన్నాతమ్ముళ్ళతో సన్నిహితం పెంచుకుంటాను. మా మధ్య గల సత్సంబంధాల్ని ఇంకా పటిష్టం చెయ్యాలని కృషి చేస్తాను. ఓ భార్యగా నేను భర్త తల్లిదండ్రి (అత్తా – మామ( • నేను సాధ్యమైనంత వరకు వారి సేవ చేస్తాను. వారి పనుల్లో చేయూతనిస్తాను. ముఖ్యంగా ఏదైనా విందు సందర్భాన. • అప్పుడప్పుడు వారికోసం ప్రత్యేకంగా మంచి మంచి రుచికరమైన వంటకాలు చేస్తాను. • వారి కోసం నేను గిఫ్ట్ తీసుకెళుతుంటాను. • వారి బంధు మిత్రులని గౌరవిస్తాను. వారితో మంచిగా పలకరిస్తాను. • వారితో నేను వారికి అయిష్టమైన వాటి గురించి మాట్లాడను. ఇష్టం లేని వస్తువుల్ని తేవను. • నేను వారి ముందు వారి కొడుకు గొప్పతనాన్ని పొగుడుతాను. ఆయనలో ఉన్న లోపాలని వారి ముందు గాని, మరెవరి ముందు గాని బహిర్గతం చెయ్యను. • నేను మా ఇంటివారికి తల్లిదండ్రులను చూసి రమ్మని ఎక్కువగా ప్రోత్సహిస్తాను. వారితో మంచిగా మసలుకోమని హితబోధ కూడా చేస్తాను. • సమయం దొరికినప్పుడల్లా నేను వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అవ్వ, తాతని ఎక్కువ విసిగించకుండా కావల్సిన జాగ్రత్తలు తీసుకుంటాను. • అప్పుడప్పుడు హోటల్ నుండి కూడా వారి కోసం మంచి వంటకాలు ఆర్డర్ చెయ్యమని మా శ్రీవారితో రిక్వెస్ట్ చేస్తాను. • వారితో కలిసి భోంచెయ్యటాన్ని ఎక్కువగా ఇష్టడతాను. భిన్న అంశాలు • మా శ్రీవారు ఇంటికి రావడంలో కాస్త ఆలస్యం అయితే, ఫోన్ చేసి వారి గురించి వారి పని గురించి తెలుసుకుంటాను. • వారు నా కోసమని తీసుకు వచ్చిన వస్తువుని మెచ్చుకుంటాను. దానిలో లోపాల్ని ఎంచను. • మా వారికి ఇష్టమైన వంటకాలు చేసి పెడతాను. • ఇంటి సామాన్లను అప్పుడప్పుడు ఓ చోట నుండి మరో చోటుకి మారుస్తుంటాను. • నా ప్రాణమా! ప్రియనేస్తమా! లాంటి ప్రేమతో కూడిన పదాలతో వారిని పిలుస్తాను. ఎప్పుడైనా కాస్త తొందరగా మేలుకుంటే ప్రపంచం, ధర్మం గురించి ప్రశ్నలు-సమాధానాలు ఫజ్ర్ నమాజ్ వరకు సాగుతాయి. ఓ భర్తగా నేను • జీవితపు అన్ని ఘడియల్లో నేను ఆమెను సుఖ పెడతాను. • ఆమె లోపాలని పదేపదే ఎత్తి చూపను. దుస్తుల్లో వంటకాల్లో, మాటల్లో ఉన్న లోపాలను అప్పటికప్పుడు వేలెత్తి చూపను. మరొకరితోనూ చెప్పుకోను. • అప్పుడప్పుడు ఆమె కోసం Gift కొని, దాచి – కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న తరువాత ఇస్తాను. • ఆమె నాకు Gift ఇచ్చినప్పుడు ఆమెను నేను ఎంతగానో మెచ్చుకుంటాను. • ఆమె నాతో ఏదైనా చెప్పదలిస్తే నేను ఆమెను ప్రోత్సహిస్తాను. నేను ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటాను. పొలం విషయంలోనైనా, వంట విషయంలోనైనా గుడ్డలు కుట్టే కుట్టించే విషయంలోనైనా, అవసరమనిపిస్తే వెనకడుగు వెయ్యను. నా వల్ల కాదు, కూడదు అని సాకులు చెప్పను. • కొన్ని సందర్భాల్లో ఆమె పట్ల నా ప్రేమని ఎక్కువ ప్రదర్శిస్తాను. ముఖ్యంగా బహిష్టు సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవించినప్పుడు. • నేను ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించను. ఆమె ఓ స్త్రీ అనీ, స్త్రీ గాజులాంటిదని సదా దృష్టిలో ఉంచుకుంటాను. ప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: “వారు (స్త్రీలు) గాజుల్లా నాజుకైన వారు. వారితో మృదువుగా ప్రవర్తించండి". • అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు నాకు ఇష్టం లేకపోయినా తెచ్చిస్తాను. • నేను ఆమెను మంచి పేరుతో పిలుస్తాను. ప్రవక్త(స) మన అమ్మగారైన ఆయిషా(ర) ని ప్రేమతో “ఆయిష్' అని పిలిచేవారు కదా! • ఆమె నా కోసం శ్రమించినప్పుడల్లా, నేను ఆమె పై ప్రశంసావర్షం కురిపిస్తాను. • నేను ఇంట్లో అడుగుపెట్టాక బయటి విషయం గురించి ఆలోచించను. నేను ఆమెకు తోడుగా ఉంటూ, రోజూ అవసరమయిన వాటి గురించి చర్చిస్తాను. • దీనీ ఇత్తెమాలలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనమని ఆమెకు చెబుతూ ఉంటాను. ఓ భార్యగా నేను అనారోగ్యం • అలసట నేను వారి దుఃఖాన్ని , కష్టభారాన్ని ఓదార్పునిచ్చే కధలు చెప్పి తగ్గిస్తాను. మీరు లేనిది ఈ ఇల్లు స్మశానమే అని చెబుతూ ఉంటాను. ఇలాంటివే మరి కొన్ని ఊరటనిచ్చే మాటలు చెబుతాను. • నేను పిల్లలను వారి నుండి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తాను. వారి ముఖ్య కార్యాల్లో పిల్లలు ఆటంకం కాకూడదన్నదే నా ప్రయత్నం. నేను వారిని అభయమిస్తూ - నవ్వుతూ పలకరిస్తాను. వారు త్వరగా కోలుకోవాలని అల్లాహ్ తో దుఆ చేస్తాను. • నేను వారి మంచి పనులను గుర్తుచేస్తాను. అలాగే వారి మంచి గుణాల పట్ల నా ఇష్టాన్ని వ్యక్త పరుస్తాను. అదే విధంగా కొన్ని సంతోష ఘడియల్ని గుర్తు చేస్తాను. • నిద్ర నేను వారి బెడి ని సర్దుతాను, బెడ్ పై సువాసన చల్లుతాను. పిల్లలను రాత్రి మొదటి ఘడియల్లోనే నిద్రపుచ్చేస్తాను... • నేను పడుకోక ముందు “ఆయతుల్ కుర్సీ" చదవమనీ, నన్ను చదివించమని వారికి రిక్వెస్ట్ చేసాను. • నేను వారి కోసం అందమైన దుస్తులు ధరిస్తాను. నేను వారిని గిలిగింతలు పెట్టడం, వారితో గిల్లికజాలాడటం, నవ్వడం, నవ్వించడం, కవ్వించడం వంటివి చేస్తాను. • నేను మంచి గుణపాఠం గల కథలు వారికి చెబుతాను. వారిని చెప్పమని కోరుతాను. ప్రయాణం • వారి దుస్తుల్ని బ్యాగ్ లో సర్దుతాను. సువాసన(సెంట్) అత్తరు లాంటివి పెడతాను. వారి జేబులో చిన్న డైరీని, ఖుర్ఆన్ చిన్న గ్రంథాన్ని పెడతాను. వచ్చేటప్పుడు ఎక్కువ వస్తువులు తీసుకురమ్మని ఒత్తిడి చేయను. • ప్రేమ లేఖల్ని వారికి తెలియకుండానే వారి దుస్తుల్లో దాచేస్తాను. నేను వారిని నవ్వుతూ సాగనంపుతాను. వెళ్ళక ముందు ముఖ్యమైన వస్తువులని మరోసారి గుర్తు చేస్తాను. • వారి ప్రయాణం తరువాత ఇంటని, పిల్లల్ని, గౌరవ మర్యాదల్ని పరువు ప్రతిష్టల్ని కాపాడుతాను. • ప్రయాణం ఎక్కువ దూరమైతే నేను వారి కోసం ఏదైనా పండి ప్యాక్ చేస్తాను. ఓ భర్తగా నేను అలంకరణ • ఆమెకు ఇష్టమైన రంగు గల దుస్తులనే కొంటాను. ఇది ఆమెకు మహా ఇష్టం . • నేను ఆమెతో మాట్లాడేటప్పుడు గానీ, ఆమెను పిలిచేటప్పుడు గాని ఓ యజమాని తన సేవకుడితో ప్రవర్తించినట్లుగానీ, ఓ మేనేజర్ తోటి కార్మికులకి ఆదేశాలు జారి చేసేటట్లుగాని, నేను ఆమెతో ప్రవర్తించను. • అవసరమనిపిస్తే ఆమెతో నా పర్సనల్ విషయాలూ చర్చించి సరైనా సలహా తీసుకుంటాను. • నేను ఆమెను పొగడ్తూ కొన్ని గేయాలు పాడుతాను. అప్పుడప్పుడు ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కుడా రాస్తాను. కొందరి కవుల కావ్యాలను ఆమెను ఉద్దేశించి కాస్త మార్పులు చేర్పులు చేసి వినిపిస్తాను. • ఆమె నా కోసం ముస్తాబయినప్పుడు మెచ్చుకుమటాను. అచ్చం అప్సరసలా ఉండావని, నీ ముందు మచ్చ వున్న ఆ చంద్రుడు కూడా అందవిహీనుడే అని కాస్త అతిగానే వర్ణిస్తాను. వంటా వార్పు • ఆమె నా కోసమని చేసిన ప్రతి వంటని పొగుడుతాను. ఈ వంట నాకు చాలా ఇష్టమని, ఈ వంట కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నిస్తాను. • సదా ఆమెతో కలిసి భోజనం చేసేందుకు ట్రై చేస్తాను. నేను ఆమెకు చేదోడు వాదోడుగా వుంటాను. ముఖ్యంగా ఏదైనా విందు వుంటే. • ఆమె అతిధుల కోసం చేసిన వంటని నేను మెచ్చుకోవడంతో పాటు ఆతిథుల మెచ్చుకోలును కాస్త పెంచి తెలియపరుస్తాను. భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య సుఖం, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడక గదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఆలుమగల మధ్య అనురాగం రెట్టింపవడానికి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో అవసరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరిగి ఒకరికొకరు మరింత దగ్గరయ్యే ఆస్కారం ఉంటుంది. రాత్రుళ్లు పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత.. ఇలా పలు సందర్భాల్లో ఒకరినొకరు కౌగిలించుకోవడం, ఆత్మీయంగా స్పర్శించడం తరచూ ఒండొకరి పట్ల గల ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్త పర్చడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇలాంటివన్నీ సంసారసాగరంలో దంపతులిద్దరికీ అసలు సిసలైన ఆనందాన్ని అందిస్తాయి. పెళ్లంటే భిన్నమనస్తత్వాలు గల ఇద్దరు అపరిపూర్ణ మనుష్యుల కలయిక కాబట్టి, అప్పడప్పుడు సమస్యలు రావడం సహజమే. పైగా వాళ్లవాళ్ల సంస్కృతి, పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా తేడాలుంటాయి. అంతేకాక, వాళ్లు మాట్లాడే తీరు కూడా చాలా భిన్నంగా ఉండవచ్చు. “వివాహ బంధం చిరకాలం నిలవాలంటే ఒడిదుడుకుల్లో నిలదొక్కుకునే తత్వం, ధైర్యం, కృతనిశ్చయం ఉండాలి.”

Comments

Popular posts from this blog

ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి? - What good has Islam done to women?

వనిత పాలిట విషకృతి వరకట్న దుష్కృతి - A woman's curse is a dowry evil