అల్లాహ్ అత్యద్భుత బహుమతి అమ్మ పాలు - Mother's milk is the best gift of Allah

 అల్లాహ్ అత్యద్భుత బహుమతి అమ్మ పాలు


భూమ్యాకాశాల్లోని ఏవస్తువూ అల్లాహ్ కు   కానరాకుండా మరుగుగాలేదు. ఆయనే (స్త్రీల) గర్భాల్లో మీ రూపురేఖల్ని తాను తలచినవిధంగా రూపొందించేవాడు. అపార శక్తి సంపన్నుడుఅద్భుత వివేచనాపరుడయిన ఆ స్వామి తప్ప (మీకు) మరో నిజ  ఆరాధ్యుడు లేడు. (ఆల్-ఇమ్రాన్: 5,6)

సృష్టికర్త అల్లాహ్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు...! తల్లి కడుపులో శిశువును సృష్టి చేయడంతోనే సృష్టికర్త పని అయిపోలేదు... పుట్టిన బిడ్డ తాగటానికి పాలను కూడా అమ్మ స్తన్యంలో నుంచి స్రవించే గొప్ప ఏర్పాటు చేశాడు. పసిబిడ్డకు గుక్కెడు పాలు - ఈ భూమిమీద దొరకవనా... ఆ ఏర్పాటు...కాదు... కాదు... అమ్మపాలలో అమృతం ఉంటుంది గనుక పుడుతూనే బిడ్డ వాటిని తన వెంట తెచ్చుకునే ఆ అద్భుత ఏర్పాటు! ఎంత దయామయుడో కదా సృష్టికర్త...! ప్రతిదానికీ బాగా ఆలోచించి ప్రణాళిక బద్ధంగా ఈ సృష్టికార్యం జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే!



సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచితర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించిఆహారం తినిపించిప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మమాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమఅమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ఋణం ఎన్ని సేవలు చేసినా   తీర్చుకోలేనిది.. అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే.

అల్లాహ్  ఇలా ఆదేశిస్తున్నాడు: ”మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచి తనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లి తండ్రులకు కృతజ్ఞుడై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది”  (ఖుర్‌ఆన్‌ 31:14)



మనషికయినాపశువుకయినాపక్షికయినాపురుగుకయినాపాముకయినా - సృష్టి చరాచరాల్లో వేటికైనా అమ్మ అమ్మే.. అమ్మ ప్రేమ అందాల హరివిల్లు - ఆ తల్లి మనసు మమకారపు తేనె జల్లు. అమ్మ ఒక కమ్మని మాటవినసొంపుగా వీనుల విందుఅనురాగానికి నిలువెత్తు ప్రతిబింబంప్రేమకు పట్టపు రాణినిస్వార్థం అనే పదానికి అర్థం అమ్మబందాలకు అనుబంధం అమ్మకనిపెంచిన మమకారానికి అనుభూతి అమ్మత్యాగానికి ప్రతీక అమ్మ. అందుకే ''అమ్మ అరికాళ్ళ క్రింద స్వర్గం ఉంది" అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ (స).

 ఇది ఇలా ఉంచి - ఒక్కసారి పాలిచ్చే పశువు గురించిఆ పశువును పుట్టించిన ప్రభువు గురించి ఆలోచించండి! పాలిచ్చే పశువులు తినే గడ్డిఆకులు తదితర వస్తువులు వాటి కడుపులోకి పోయి రక్తంపేడమూత్రంపాలుగా మారతాయి. రక్తం నరాలలోకి వెళ్ళగాపేడమూత్రం వంటి వ్యర్థాలు బయటికి విసర్జించబడతాయి. వాటి మధ్యలో నుంచే తయారైన పాలు పొదుగులలోకి వెళతాయి. కాని ఆశ్చర్యకర మైన విషయం ఏమిటంటే ఆ పాలలో ఒక్క బొట్టు రక్తంగానీఒక చుక్క వ్యర్థ పదార్థంగానీ కలవదు. పాలు ఎంతో స్వచ్ఛంగాతెల్లగా ఉంటా యి. కమ్మగారుచికరంగా ఉంటాయి. శరీరానకి శక్తినిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. మనసుకుమస్తిష్కానికి తృప్తినీహాయిని ఇస్తాయి. ఇదే విషయాన్ని విశదపరుస్తూ సర్వోన్నతుడయిన అల్లాహ్‌ ఇలా సెలవిస్తు న్నాడు: ”నిశ్చయంగా మీ కోసం పశువులలో గొప్ప గుణపాఠం ఉంది. వాటి కడుపులో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది”. (అన్నహ్ల్ : 66)

 అల్లాహ్ తొలి వరం అమ్మ  కమ్మనైన క్షీరం

అమ్మ పాలు .. సృష్టి అద్భుతాల్లోని మహా అద్భుత క్షీర సాగరం. దానికి సాటిమేటిపోటీ అనేదే లేదు. . అమ్మ పాలకు మించిన అమృతం  ఈ జగాన మరోకటి  లేదు. వమాసాలు గర్భంలో  ఉండి  అందుకొన్న తొలి వరం కమ్మనైన అమ్మ  క్షీరం. తల్లిపాల వలన కలిగే లాభాల జాబితాలో ప్రతీ రోజూ కొత్త విషయాలు చేరుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదరశోక (రెస్పి రేటరీ) మరియు జీర్ణ వ్యవస్థలకు సంబంధిం చిన ఇన్‌పెక్షన్ల నుండి పసిపాపలను తల్లిపాలు రక్షిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది ఎలా అంటేతల్లిపాలలోని యాంటీ బాడీస్‌ ప్రత్యక్షంగా ఇన్‌ఫెక్షన్లతో పోరాడ తాయి.

ఇన్‌పెక్షనని ఎదుర్కొనే తల్లిపాలలోని ఇతర లక్షణాలు మేలు చేసే బాక్టీరియా (నార్మల్‌ ఫ్లోరా) ఉండటానికి అనువైన వాతారవణాన్ని ఏర్పరుస్తాయి. ఆ విధంగా హానికలిగించే పరాన్న జీవులువైరస్‌లుబాక్టీరియాలకు అడ్డుగా నిలుస్తాయి. అంతేకాకుండా నిరూ పితమైన మరో విషయం ఏమిటంటేతల్లి పాలలోని అంశాలు అంటురోగ వ్యాధులకు వ్యతిరేకంగా ఇమ్యూన్‌ సిస్టమ్‌ని ఏర్పరచడమే కాకుండా దానిని సవ్యంగా పని చేసేలా చేస్తాయి.

 

తల్లిపాలు అల్లాహ్ కృపచే  ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి కనుకపసిపిల్లలకు ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారంతల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండాబేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిని జీర్ణం చేసుకోవడానికి బేబీకి తక్కువ శక్తిసరిపోవడం వలనమిగిలిన శక్తి శరీరం యొక్క ఇతర విధుల,పెరుగుదలఅవయాల అభివృద్ధి కొరకు ఉపయోగపడు తుంది.

కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుడతారు. అలాంటి పిల్లలను ప్రసవించిన తల్లుల పాలలో ఆ పిల్లల అవసరానికి సరి పోయేలా ఎక్కువ మోతాదులో కొవ్వుప్రొటీన్‌సోడియంక్లోరైడ్‌ మరియు ఐరన్‌ ఉంటాయి. ఇలాంటి పిల్లలలో ‘కళ్ళ’కు సంబంధించిన విధులు చాలా బాగా అభివృద్ధి చెందేది తల్లిపాల వల్లనేనని తెలుసుకున్నారు. అంతే కాకుండా అటువంటి పిల్లలు ఇంటెలి జెన్స్‌ పరీక్షలలో బాగా రాణించారు. తల్లిపాల వలన ఇంకా చాలా ఉపయోగా లున్నాయి. పుట్టిన బిడ్డ అభివృద్ధికి సంబంధిం చిన వాటిలో అతి ముఖ్యమైనది తల్లి పాలు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇందులో ఒమేగా – 3 ఆయిల్‌ అల్ఫాలైనోలీక్‌ యాసిడ్స్‌      ఉంటాయి. ఇది మెదడుకు మరియు రెటీనాకు చాలా ముఖ్యమైన మిశ్రమపదార్థమే కాకుండాకొత్తగా పుట్టిన పిల్లల దృష్ట్యా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒమేగా-3కి సహజమైన మరియు పరిపూర్ణమైన స్టోర్‌ తల్లిపాలు. అంతే కాకుండా తల్లిపాల వలన దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనిఅవి ఏమి టంటే బ్లడ్‌ ప్రెషర్‌పై మంచి ప్రభావాన్ని కలిగి ఉండిగుండెపోటు సమస్యను తగ్గిస్తుందని బ్రిస్టల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలియ జేశారు.

మెడికల్‌ జర్నల్‌ ‘సర్క్యులేషన్‌’లో ప్రచురిం చిన పరిశోధనా ఫలితాలను బట్టి తల్లి పాల వలన పెరిగే బిడ్డలో గుండె సంబంధిత వ్యాధులు రావడం తక్కువని తెలుస్తుంది.తల్లి పాలలో పోలీ అను సాట్యురేటెడ్‌ ఫేటీ యాసిడ్ల పొడవాటి చైన్‌ ఉండటం వలనఅది ఆర్టెరీస్‌ గట్టి పడకుండా నిరోధిస్తుంది.  తల్లి  అమెరికాలోని చిన్న పిల్లల హాస్పిటల్‌ మెడికల్‌ సెంటర్‌ టీమ్‌కి నాయ కత్వం వహించిన డా.లిసా మార్టిన్‌,  అనే ప్రొటీన్‌ హార్మోన్‌ అధిక మోతా దులో తల్లిపాలలో ఉన్నట్లు కనుగొన్నారు. రక్తంలో అధిక మోతాదులో ఉంటే హార్ట్‌ ఎటాక్‌ సమస్య తగ్గుతుంది. హార్ట్‌ ఎటాక్‌కు ఎక్కువగా కారణమయ్యే స్థూల కాయం కలవారిలో  తక్కువ స్థాయిలో ఉంటుంది.

ఈ హార్మోన్‌ వలన స్థూలకాయ సమస్య తల్లి పాలతో పెరిగిన పిల్లలలో తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. లెప్టిన్‌ అనే మరో హార్మోన్‌ను కూడా తల్లి పాలలో కను గొన్నారు. ఇదిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

పసి పిల్లలకు పోషకాలున్న ప్రెష్ ఫుడ్ అమ్మ పాలు

 తల్లిపాలకు సంబంధించిన నిజాలు పైన చెప్పిన వాటితో పూర్తయి పోలేదు. బిడ్డ పెరుగుతున్నప్పుడుఆ పెరిగే థలను బట్టిఆ దశలకు సరిపోయే ఆహారం అవసరమౌ తుంది. దానికి తగ్గట్టుగా పాలలోని పోషక పదార్థాలు ఈ ప్రత్యేక అవసరాలకు సరిపోయే విధంగా మారుతూ ఉండాలి. ఆ విధంగానే బిడ్డ ఎదుగుదలను బట్టి తల్లి పాలలో ఉండే పదార్థాలు మారుతూ ఉంటాయి.

తల్లి పాలు అన్ని సమయాలలో సరియైన ఉష్ణోగ్రత (వేడి)లో లభ్యమౌతాయి. మెదడు అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఎలా అంటే పాలు తనలో కలిగి ఉండే సుగర్‌ మరియు కొవ్వు (ఫ్యాట్)  వలన. దీనితోపాటుకాల్షియం వంటి మూలకాలు బిడ్డ ఎముకల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

పాలు’ అని పిలువబడుతున్నప్పటికీఈ అద్భుత మిశ్రమ పదార్థంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆహారంతోపాటుపసి పిల్లలకి నీటి రూపంలో ద్రవం కూడా కావాలి. తల్లిపాలకంటే పరిశుభ్రమైన నీరు గానిఆహారపదార్థాలు గాని తయారుకాలేదు. తల్లిపాలలోని 90 శాతం నీరు పరిశుభ్రమైన వాతావరణంలో బిడ్డ అవసరాన్ని తీరుస్తుంది.



కొలొస్ట్రమ్ (ముర్రు పాలు)

బ్రెస్ట్ ఫీడింగ్‌ విషయంలో ఇప్పటికీ చాలా మందిలో తగినంత అవగాహన ఉండడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులువైద్య సిబ్బందినర్సింగ్ సిబ్బంది శిశువు జన్మించిన తరువాత తల్లిపాలు పట్టించడంలో అశ్రద్ధ చూపుతారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యం పొందడంలో తల్లిపాలది చాలా కీలక పాత్ర. తల్లిపాలలో కూడా మూడు దశలు ఉంటాయి. కొలొస్ట్రమ్ట్రాన్సిషనల్ మిల్క్మెచ్యూర్ మిల్క్ అనే మూడు దశలు ఉంటాయి.

శిశువుకు జన్మనిచ్చాక వచ్చే తల్లిపాలు మందంగా ఉంటాయి. ఈ తొలి పాలనే కొలొస్ట్రమ్ అంటారు. తెలుగులో ముర్రు పాలు అంటాం. వైద్యులుతల్లులు దీనిని ద్రవరూపంలో ఉన్న బంగారం అంటారు. గాఢమైన పసుపు రంగులో ఉండడమే కాకుండాఇవి శిశువుకు అమృతం లాంటివి. చాలా పోషకాలుయాంటీబాడీస్ కలిగి ఉంటాయి. ఇవి బిడ్డను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. కొలస్ట్రమ్ బేబీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి.

సాధారణ తల్లి పాలకంటేదీనిలో అధికంగా ప్రోటీన్లుఎ-విటమిన్‌సోడియమ్‌ క్లోరైడ్‌ మరియు యాంటీబాడీస్‌   ఉంటాయి. తక్కువ మోతాదులో కార్బో హైడ్రేట్లులిపిడ్లు మరియు పొటాషియం ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ చాలా చిన్నదిగా ఉంటుంది. అటు వంటి సమయంలో బిడ్డకు తక్కువ మరిమాణంలో ఎక్కువ పోషకాలున్న ఆహారం కావాలి. ఆ అవసరాన్ని కొలస్ట్రమ్‌ తీరుస్తుంది. బిడ్డకు జాండిస్‌ రాకుండా కాపాడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడుతల్లి రోగ నిరోధక శక్తే బిడ్డను కాపాడుతుంది. ప్రసవించాకఈ కొలస్ట్రమ్‌ వ్యాధికారకాల నుండి బిడ్డను కాపాడుతుంది.

ట్రాన్సిషనల్ మిల్క్

బిడ్డకు జన్మనిచ్చాక ముర్రు పాలు ఒకటి రెండు రోజుల వరకు వస్తుంటాయి. తదుపరి దశలో అంటే 2 నుంచి 5 రోజుల తరువాతి నుంచి రెండు వారాలు వచ్చే వరకు ఉండే పాలను ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు. పాలు పూర్తిస్థాయిలో పడడంరొమ్ము వెచ్చగా ఉండడంపాలు క్రమంగా తెలుపు రంగులోకి రావడం గమనిస్తారు. బేబీ అవసరాలకు సరిపడా పాలు అందుతాయి. తరచుగా పాలు పట్టేందుకు వీలు ఉంటుంది.

మెచ్యూర్ మిల్క్

ప్రసవం తరువాత 10 నుంచి 15 రోజుల్లో ఈ దశ వస్తుంది. ఈ దశలో తల్లిపాలలో బేబీ అవసరాలకు తగిన పోషకాలు లభిస్తాయి. పాలల్లో కొవ్వు శాతం మారుతుంది. తొలుత ఒక రొమ్ము నుంచి పాలు పూర్తిగా పట్టాక మరొక రొమ్ముకు మళ్లడం వల్ల బేబీకి పోషకాలు సమతుల్యంగా అందుతాయి.

అమ్మ పాలలో   IQ  (Intelligence quotient)  మరియు EQ  Emotional quotient

సాధారణంగా అమ్మ పాలు కాకుండా పిల్లలకు మనం పెట్టె ఆవుగేదె పాలల్లోగానిడబ్బా పాల్లోగాని శిశువుకి కావాల్సినంత IQ  (Intelligence quotient)  మరియు EQ  Emotional quotient ఉండదు. ఒక్క అమ్మ పాలలోనే అది సంపూర్ణంగా ఉంటుంది. ఇతర పిల్లల కంటే తల్లిపాలు త్రాగిన బిడ్డలోనే జ్ఞానాభివృద్ధి ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జేమ్స్‌ డబ్ల్యూ ఆండర్‌సన్‌ (కెంటకీ యూనివర్శిటీ ఎక్స్‌పర్ట్‌) తల్లిపాలు త్రాగిన పిల్లలకుకృత్రిమ ఆహారాన్ని తీసుకున్న పిల్లలకు మధ్య తులనాత్మక అధ్యయనం చేశారు.   తల్లిపాలు త్రాగి పెరిగిన పిల్లలలో ఐ.క్యూ 5 పాయింట్లు ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. 6 నెలల వరకూ తల్లిపాలు త్రాగిన పిల్లలకు ఇంటెలిజెన్స్‌కు ప్రయోజనం కలుగుతుంది.

శిశువుకి మొదటి టీకా తల్లిపాలు

తల్లిపాలు శిశువు ఎదుగుదలకి అవసరమైన పౌష్టికాహారం సమపాళ్ళలో అందిస్తుంది. ఇది వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుండి శిశువులను రక్షించేందుకు సహాయపడే యాంటీబాడీలు కలిగి ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లుశ్వాసకోశ ఇన్ఫెక్షన్లుమరియు విరేచనాలు వంటి అనారోగ్యాలు తగ్గిస్తాయి. శిశువు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాథమిక నెలలలో ఈ సహజ రక్షణ చాలా ముఖ్యం. అలాగేతల్లిపాలతో పోషణ పొందిన పిల్లలలో భవిష్యత్తులో మాంద్యంలోషుగర్ వ్యాధిమరియు కొంతమంది చిన్నపిల్లల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక పరిస్థితులు తగ్గిస్తాయి. రొమ్ము పాలించడం తల్లి మరియు శిశువు మధ్య ఒక ప్రత్యేక భావోద్వేగ సంబంధాన్ని పెంచుతుంది. ఇది భద్రత మరియు భావోద్వేగ అనుభూతిని పెంపొందిస్తుంది. ఇది పిల్లల మానసిక అభివృద్ధికి ముఖ్యము మరియు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఫార్ములా ఫీడ్‌ల కంటే మెరుగైన రోగనిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమాతామర మరియు అటోపిక్ చర్మ సంబ‌ధిత వంటి అలర్జీలు వచ్చే ప్రమాదం తక్కువ.

కరుణామయుని కరుణానుగ్రహం కన్నతల్లి కమ్మనైన క్షీరం

తల్లిపాల యొక్క మరొక అద్భుత అంశమేమిటంటేరెండు సంవత్సరాల పాటు తల్లి పాలు త్రాగితే అది బిడ్డకు చాలా ప్రయోజనకారి అవుతుంది. ఈ విషయం ఈ మధ్య కాలంలోనే సైన్స్‌ ద్వారా కనుగొనబడింది. అయితేఈ విషయాన్ని అల్లాహ్  1432 సంవత్సరాల క్రితమే క్రింది ఖుర్‌ఆన్‌ వాక్యం ద్వారా తెలియజేశాడు:

పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని కోరినట్లయితేతల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి”. (ఖుర్‌ఆన్‌ 2:233)

ఇదే విధంగాబిడ్డ అవసరాలకి అన్ని విధాల సరిపోయే సరియైన పోషకాలుండే పాలనుఆ పాల ఉత్పత్తిని తల్లి నిర్ణయించ లేదు. పాలలో వివిధ పోషక పదార్థాల స్థాయిని కూడా తల్లి నిర్ణయించలేదు. ఇది సర్వ శక్తిమంతుడైన అల్లాహ్‌కే తెలుసు. ప్రతీ జీవి యొక్క అవసరాలుప్రతీ జీవిపై చూప వలసిన కరుణ గురించి ఆయనకే తెలుసు. కరుణామయుల్లోకెల్లా మహా  కరుణామయుడుసంరక్షకుల్లోకెల్లా అత్యద్భుత సంరక్షకుడు అల్లాహ్గనుకనే  ఆయన తల్లి శరీరంలో పాలను సృష్టించింది. కాబట్టి ఏదో అనుకోకుండా తయారు కాలేదు ఇది. ఈ సృష్టినంతటినీ ఓ పద్ధతిలో సృష్టించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఒక్కే ఒక్కడు అనడానికి గొప్ప తార్కాణం.

 అపోహలను మానండి అమ్మ పాలును అందించండి

తల్లిపాల గురించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వీటివలన కొంత మంది శిశువులు తల్లి పాలకు దూరం అవుతున్నారు. అటువంటి తల్లులకు ఈ సందర్భంగా అవగాహన చెయ్యవలసిన అవసరం ఉంది. కొంత మంది పిల్లలు పాలు త్రాగిన వెంటనే వాంతి చేస్తారు. తాగేటప్పుడు నోటితో కొంత గాలిని పీల్చడం వలన ఇలా జరుగుతుంది. ఇది ప్రమాదం కాదు. దీనిని వైద్య భాషలో పోసెట్టింగ్ అంటారు. తల్లిపాలు పెట్టిన వెంటనే నేల లేదా మంచంపై పడుకోబెట్టకుండాభుజంపై వేసుకొని కొంతసేపు ఉంచాలి. ఎక్కువగా కదల్చరాదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీరు అవసరం లేదు. బిడ్డకు అవసరమైన నీరు తల్లిపాలలో ఉంటాయి. శిశువుకు విరేచనాలు అయితే కొంతమంది తల్లులు పాలు పెట్టరు. డాక్టరు సలహా మేరకు పట్టించడం ఆపాలే తప్పసొంతగా ఆపనవసరం లేదు. తల్లి గర్భవతిగా ఉన్నా కూడా బిడ్డకు పాలివ్వవచ్చు. కొన్ని పరిస్థితులలో ఒకటి రెండు రోజులు బిడ్డకి అందించక పోయినా తరువాత వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. పాలిచ్చే తల్లి అవసరం మేరకు పండ్లు తీసుకోవాలే తప్ప ఎక్కువ పండ్లు తల్లి తీసుకోనవసరం లేదు.మరో పెద్ద అపోహ ఏంటంటే సిజేరియన్ అయిన వెంటనే తల్లి లేవకూడదని పాలు తాగించరు. అలాకాక తల్లి పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే డాక్టర్ సూచన మేరకు నర్సుల సహాయంతో బిడ్డకు పాలు ఇవ్వాలి. శిశువు పుట్టిన తరువాత తల్లి నుండి వచ్చే పాలు సరిపోవని బయట పాలు అందిస్తారుఅలా చేయకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి.

అమ్మతనానికి మించిన అందం ఉందా?

మన దేశంలో కొంత మంది తల్లులు బిడ్డకు పాలు పెట్టడం వలన తమ అందం పోతుందని పాలివ్వరు. అమ్మతనానికి మించిన అందం ఈ ప్రపంచంలో ఉందాప్రకృతిలో ఏ జంతువు ఇలా ఆలోచించదు. బిడ్డకు బయట నుండి డబ్బా పాలు అందిస్తారు. ఇది చాలా తప్పు. ప్రకృతి ప్రసాదించిన గాలినే పీల్చుతాం. ప్రకృతి అందించిన నీటినే త్రాగుతాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకోగలమా అలానే తల్లి పాలకు కూడా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విదేశాల నుండి తీసుకొచ్చిన పాల పొడులు కూడా అమ్మ పాలకు మించిపోవు. తల్లులందరూ బాగా ఆలోచించాలి. పిల్లలకు పెద్దయిన తరువాత ఆస్తులుఅంతస్తులుడబ్బు ఇవ్వాలనుకుంటారు. కానీ వాటి కంటే పిల్లలకు ఇచ్చే మొదటి ఆస్తి తల్లిపాలనే విషయం గుర్తెరగాలి. పాలివ్వడం వలన అందం ఏం  తరగదు. ఇంకా పెరుగుతుంది.

బిడ్డకు పాలిస్తే తల్లికే లాభం

బిడ్డకు పాలివ్వడం వలన తల్లికి కూడా లాభాలున్నాయి. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువ పెరుగుతుంది. పాలివ్వడం వలన బరువు తగ్గుతారు. రొమ్ము క్యాన్సర్అండాశయ క్యాన్సర్రక్తపోటుటైప్ 2 మధుమేహం వంటి రోగాలు భవిషత్తులో రాకుండా అడ్డుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత తమ శిశువులకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఉండే దేశం క్రొయేషియా. ఇక్కడ 98 శాతం మంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇంకా రువాండాచిలీబురుండి వంటి దేశాలలో ఉండే తమ పిల్లలకు పాలిచ్చే తల్లులు 80 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులలో అనగా ఉద్యోగరీత్యాబయట పనులు చేయడం వలన తమ శిశువుకు పాలు అందివ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రసవానంతర సెలవులు ఇస్తున్నారు. అలానే ప్రైవేటు రంగంలో కూడా కనీసం ఆరు మాసాలు వేతనంతో కూడిన సెలవివ్వాలి. పాలిచ్చే అమ్మ పొలం పనులకు కూలీ పనులకుఆ ఆరు మాసాలు వెళ్లకుండా ఇంటిలోని యజమానులుకుటుంబ సభ్యులు సహకరించాలి. ఈ సంవత్సర లక్ష్యాలు ఆరోగ్య కేంద్రాలుపని ప్రదేశాలలోని మహిళా ఉద్యోగినులకు మద్దతుకై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన చర్యలుప్రసూతి అర్హతలు మరియు ఇతర సహాయ చర్యల సమాచారాన్ని తెలియపరచడంఈ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగినులను ప్రోత్సహించే కార్యక్రమాలను బలోపేతం చేయడం. ఆఫీస్‌లలో మాతృత్వ సెలవులు మరియు తల్లిపాలు ఇవ్వడానికి విరామ సమయం ప్రకటించాలి. ముగింపుగాతల్లి పాలు ఒక ఆహార ఎంపిక మాత్రమే కాదు.  ఇది శిశువుల మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన హెల్త్ ఇన్‌ర్వెన్షన్ అని చెప్పాలి. భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచడానికి తల్లి పాల తల్లులకు మద్దతు అందించడం ముఖ్యం.

 

జర పైలం తల్లో!

బిడ్డకు తల్లి స్తన్యం ఇవ్వటం అన్నది ఎంత సహజ విషయమే అయినా... అందులో కొంత అజ్ఞానంఅమాయకత్వం కూడా కొంతమంది విషయంలో ఉందని  కొన్ని దశాబ్దాల  ముందే కాదు నేటి తల్లుల గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.  తల్లులు బిడ్డను పక్కలో  పడుకోబెట్టి పాలు ఇచ్చేవాళ్ళు... ఇస్తున్నారు. బిడ్డ పాలు తాగుతుండగనే తల్లులు నిద్రపోయేవాళ్ళు.. పోతున్నారు  కూడా! దానివల్ల పాలధారల వేగానికి పిల్లలు ఉక్కిరిబిక్కిరై శిశు మరణాలు కూడా సంభవించేవి... నేటికీ సంభవిస్తున్నాయి.  ఇప్పుడు డాక్టర్లు ‘తల్లులు కూర్చుని పిల్లలకు పాలు పట్టాలని ఆ వెంటనే భుజాన ఎత్తుకుని వెన్ను చరచాలని... త్రేన్పు వచ్చేదాకా అలా చేయాలనీ చెబుతున్నారు. ఈ విషయం అప్పటిఇప్పటి చాలా మంది  తల్లులకు తెలియదు. కాన్పు అయిన మొదటిరోజు తల్లి స్తన్యం నుంచి స్రవించే ముర్రుపాలలో పిల్లలకు రోగనిరోధక శక్తిని అందించే గుణంఇన్‌ఫెక్షన్స్ నుంచిచెడు బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి రక్షించే శక్తి ఉంటుందని గైనకాలజిస్టులుపిడియాట్రిషియన్లు చెబుతున్నారు. కానీ గతంలో  ఆడవాళ్ళు ‘అవి మురికిపాలని’ పిండి పారేసేవాళ్ళే గానీ పిల్లలకు తాగించేవాళ్ళు కాదు. దానివల్ల... ఆ అజ్ఞానంవల్ల... పిల్లలకు ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకమీదట జరగకుండా జాగ్రత్త పడాలి!!


Comments

Popular posts from this blog

ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి? - What good has Islam done to women?

ఆలుమగల కాపురం అనురాగ గోపురం అవ్వాలంటే - Alumagala Kapuram should become Anuraga Gopuram

వనిత పాలిట విషకృతి వరకట్న దుష్కృతి - A woman's curse is a dowry evil